Game Changer Sequel: గేమ్ ఛేంజర్ సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన శంకర్

Game Changer Sequel: గేమ్ ఛేంజర్ సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన శంకర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పోటికల్ థ్రిల్లర్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ సినిమా గురించి కొంత కాలంగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. గేమ్ ఛేంజర్ సినిమాకు పార్ట్ 2 రానుందని. దాంతో ఆ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. అయితే.. ఈ విషయంపై తాజాగా స్పందించాడు దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా జులై 12న విడుదల కానుంది. 

ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సీక్వెల్ పై స్పందించారు. గేమ్ ఛేంజర్ సినిమాకు సీక్వెల్ ఉందని స్పష్టం చేశారు. కథా పరంగా చూసుకుంటే ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఛాన్స్ లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చేశాడు శంకర్. దాంతో.. గేమ్ ఛేంజర్ సీక్వెల్ పై కొంత కాలంగా వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.