
ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ షేక్‌దావూద్ (73) వయోభారం కారణంతో చెన్నైలో మృతిచెందారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని టీనగర్‌లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నదావుద్ నిన్న శనివారం కన్నుమూసినట్లు సమాచారం. దీంతో సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేస్తుంది.
అంతేకాకుండా మూడేళ్ల క్రితం ఆయనకు సతీవియోగం చెందడంతో కొన్నాళ్లుగా బాధలో ఉన్నారు. ఇవాళ ఆదివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. షేక్ దావూద్‌కు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
దావూద్ సినిమాల విషయానికి వస్తే..చిన్నప్పుడే ఆయనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో చెన్నైకి వచ్చారు.ఆయన దివంగత డిజైనర్ ఈశ్వర్ వద్ద శిష్యరికం చేస్తూ సినిమాల్లో పట్టు పెంచుకున్నారు. ఇక తెలుగులో కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, బాలకృష్ణ, చిరంజీవితో పాటు పలువురి చిత్రాలకు పోస్టర్ డిజైన్ చేస్తూ..మంచి గుర్తింపు పొందారు.
తమిళ శంకర్ డైరెక్షన్లో వచ్చిన జీన్స్, జోడి, ప్రేమిస్తే వంటి ఫేమస్ మూవీస్కి డిజైనర్గా చేశారు. దాదాపు ఆయన 300 పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్గా పనిచేసినట్లు ఫ్యామిలీ మెంబర్స్ వెల్లడించారు.