ఇంక పదిరోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ : శంకర్

ఇంక పదిరోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ : శంకర్

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో  దర్శకుడు శంకర్ జోష్‌‌‌‌ని నింపారు.  ఇటీవల ‘భారతీయుడు2’ ప్రమోషన్స్‌‌‌‌లో  పాల్గొన్న శంకర్.. ‘గేమ్ చేంజర్’ షూటింగ్ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో పాటు మూవీ రిలీజ్‌‌‌‌పై క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ దాదాపుగా పూర్తయిందని, ఇంక పదిరోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నారు. 

‘భారతీయుడు 2’ రిలీజ్ కాగానే ‘గేమ్ చేంజర్’ వర్క్‌‌‌‌ను కంప్లీట్ చేస్తామన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌‌‌‌పుట్ చూసి రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తాం అన్నారు.  పొలిటికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌‌‌‌. అంజలి, శ్రీకాంత్,  నవీన్ చంద్ర, ఎస్‌‌‌‌.జె.సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.