రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు స్టోరీని అందించాడు. ఓవైపు కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ తీస్తూనే మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు శంకర్. ఇటీవల మూవీ షూటింగ్ గురించి ఓ అప్డేట్ ఇచ్చారు శంకర్.
‘ఎలక్ట్రిఫయింగ్ క్లైమాక్స్ షూట్‌ను కంప్లీట్ చేశాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. శంకర్ సినిమాల్లో క్లైమాక్స్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. దీంతో సినిమాకెంతో కీలకమైన పార్ట్ షూట్ పూర్తయినట్టు అర్థమవుతోంది. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసిన శంకర్.. ఇక తన ఫోకస్‌ను ‘ఇండియన్ 2’కి షిప్ట్ చేస్తున్నానని, ఆ సినిమాకు సంబంధించి సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్ తీయబోతున్నట్టు చెప్పారు. మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్.