అందుకే మహేష్ తో తీసిన సినిమా ఫ్లాప్ అయ్యింది: డైరెక్టర్ శ్రీనువైట్ల.

అందుకే మహేష్ తో తీసిన సినిమా ఫ్లాప్ అయ్యింది: డైరెక్టర్ శ్రీనువైట్ల.

అప్పట్లో వెంకీ, దూకుడు, దుబాయ్ శ్రీను తదితర మంచి కామెడీ క్లాసికల్ హిట్స్ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. కానీ రాన్రాను ట్రెండ్ కి తగ్గట్టుగా అప్డేట్ అవ్వకపోవడం అలాగే కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటివాటి కారణంగా  శ్రీను వైట్ల కొంతమేర సక్సస్ కి దూరమయ్యాడని చెప్పవచ్చు. 

ఆ మధ్య ప్రిన్స్ మహేష్ తో తెరకెక్కించిన ఆగడు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని కామెడీ మరియు ఫ్యామిలీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కానీ దూకుడు సినిమాలో మాదిరిగా ఆగడు లో కామెడీ పండలేదు, ఫ్యామిలీ సెంటిమెంట్ వరకౌట్ అవ్వలేదు. 

Also Read :- మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత

దీంతో తాజాగా డైరెక్టర్  శ్రీను వైట్ల ఆగడు చిత్రం ఫ్లాప్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా తాను ఆగడు కోసం అనుకున్న కథ ఒకటైతే తీసింది మరొకటని దాంతో సినిమా రిజల్ట్ తారుమారైందని పేర్కొన్నాడు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం  శ్రీను వైట్ల తెలుగులో విశ్వం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో హీరోగా స్టార్ హీరో గోపీచంద్ నటించగా బ్యూటీఫుల్ హీరోయిన్ కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకులముందుకు రాబోతోంది.