Pawan, Prabhas: పవన్, ప్రభాస్ మల్టీస్టారర్.. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్

Pawan, Prabhas: పవన్, ప్రభాస్ మల్టీస్టారర్.. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్

టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తో మల్టీస్టారర్ గురించి చెప్పి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇటు సోషల్ మీడియాలో, అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ తెలియడంతో ఈ ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా భజే వాయువేగం అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా.. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు సాహో ఫేమ్ దర్శకుడు సుజీత్. ఈ దర్శకుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఓజి. 

ఈ ప్రమోషన్స్ లో దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నీ కుదిరితే తనకు పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో ఒక మల్టీస్టారర్ చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకేముంది.. సుజిత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై ఇద్దరి హీరోల ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. తొందరగా చేయండి అన్నా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్, ప్రభాస్ కాంబోలో సినిమా అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. కేవలం.. ఒక కామెంట్ కే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉందంటే.. నిజంగా సినిమా వస్తే ఆ క్రేజ్ మాములుగా ఉండదు.