అనౌన్స్ చేసిన వారం రోజులకే.. రజినీ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్‌.. నన్ను క్షమించండి అంటూ పోస్ట్

అనౌన్స్ చేసిన వారం రోజులకే.. రజినీ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్‌.. నన్ను క్షమించండి అంటూ పోస్ట్

రజినీకాంత్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మాణంలో ఇటీవల ఓ సినిమాను అనౌన్స్‌‌‌‌ చేసిన విషయం తెలిసిందే.  అయితే దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు గురువారం (2025 Nov13) ప్రకటన విడుదల చేశారు.

అనివార్య కారణాలతో దీని నుంచి తప్పుకుంటున్నానని, ఇద్దరు హీరోల తనకెంతో ముఖ్యమైన వ్యక్తులని, వారితో కలిసి పనిచేయలేకపోతున్నందుకు బాధపడుతున్నానంటూ ఆయన  తెలియజేశారు. సినిమా అనౌన్స్‌‌‌‌ చేసిన వారం రోజులకే ఆయన దీని నుంచి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

రజినీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 173వ చిత్రం. నిజానికి ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి లోకేష్ కనగరాజ్, కార్తిక్ సుబ్బరాజ్ లాంటి యువ దర్శకుల పేర్లు మొదటి నుంచి ప్రచారంలో ఉన్నాయి.

ఇప్పుడు  సుందర్ సి స్వయంగా  తప్పుకోవడంతో ఆ ప్లేస్‌‌‌‌లో ఎవరు ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను డైరెక్ట్ చేయబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. సుందర్ సి స్థానంలోకి కార్తీక్ సుబ్బరాజ్ అయితే బావుంటుందని కొంత మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్-కమల్ హాసన్ ఏం చేస్తారో చూడాలి.