
టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు తేజ. ‘జయం’ దగ్గర్నుంచి ‘నేనే రాజు నేనే మంత్రి’ వరకు.. రూపొందించిన ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్ ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం రానా తమ్ముడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇప్పుడు తేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఒకేసారి రెండు ప్రాజెక్టులు చేయడానికి కమిటయ్యారు. ‘జఖ్మీ’ అనే సినిమాతో పాటు, ‘తస్కరి’ అనే వెబ్ సిరీస్‌ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు తేజ. టైమ్ ఫిల్మ్స్, ఎన్.హెచ్. స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ సంస్థలు వీటిని నిర్మించనున్నాయి. ‘జఖ్మీ’ కాశ్మీరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఇద్దరు హీరోలుంటారు. ఇక ‘తస్కరి’ 1980లో ముంబైలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతుందని, ఈ రెండింటికీ సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.