డర్టీ చాయ్.. ఈ పేరు వింతగా ఉన్న దీంతో ఉండే లాభాలు మాత్రం అన్నీఇన్నీ కావు. మనకున్న చాయ్ లన్నింటికంటే ఇది బెస్ట్ చాయ్. డర్టీ చాయు పచ్చి యాలకులు, దాల్చిన ఉచెక్క, లవంగాలు, మిరియాలు, అల్లంతో చేస్తారు. రంగు వల్ల దీన్ని అలా పిలుస్తారు. దీన్ని పాలతో కలిపి లేదా డికాషన్లాగానే తీసుకోవచ్చు. డర్టీ చాయ్ అనేది ఎస్ప్రెస్సో చాయ్. ఎస్ప్రెస్సో అనేది కాఫీ తయారు చేసే ఇటాలియన్ మెథడ్. ఎక్కువ ప్రెజర్ తో నీళ్లను మరిగిస్తూ కాఫీ తయారుచేస్తారు. ఇదే పద్ధతిలో డర్టీ చాయ్ కూడా తయారు చేస్తారు. ఇందులో కోల్డ్, హాట్ అని రెండు రకాలున్నాయి.
ఉపయోగాలివే:
డర్టీ చాయ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా ఇది ఇమ్యూనిటీని పెంచడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కొనేందుకు ఇవి బాగా సాయపడతాయి.
ఇందులో ఉండే ఇంగ్రెడియంట్స్ బీపీని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్న వాళ్లు కూడా ఈ చాయ్ తాగొచ్చు. టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుందని స్టడీలు చెప్తున్నాయి.
ఇందులో ఉండే ఇంగ్రెడియంట్స్ తో శరీరానికి పాలిఫినోల్స్ అందుతాయి. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి ఇంకా జీర్ణ వ్యవస్థకు ఇవి బాగా సాయపడతాయి.
ALSO READ : బిపి, షుగర్ ఉన్నవాళ్లు దానిమ్మ రసాన్ని తాగుతున్నారా ? ఎప్పుడు తాగాలి ? ఎలా తాగాలంటే...
