మున్సిపాలిటీల్లో అవిశ్వాస అలజడి

మున్సిపాలిటీల్లో అవిశ్వాస అలజడి

యాదగిరిగుట్ట చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన కౌన్సిలర్లు
ఆలేరులో రింగవుతున్న సభ్యులు
ఎమ్మెల్యే పైళ్లను కలిసిన పోచంపల్లి, భువనగిరి లీడర్లు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అవిశ్వాస అలజడి మొదలైంది. యాదగిరిగుట్ట చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ ఎరుకల సుధకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు అవిశ్వాసం నోటీస్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం, మిగిలిన మున్సిపాలిటీల్లోనూ కౌన్సిలర్లు ఏకం అవుతున్నారన్న వార్తలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. యాదగిరిగుట్టలో మొత్తం 12 వార్డులు ఉండగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఏడు స్థానాల్లో గెలువగా, మరో వార్డులో ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ గెలిచారు. ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేర్చుకొని వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవి ఇవ్వడంతో పాటు, ఇద్దరు ఎక్స్‌‌‌‌‌‌‌‌ అఫీషియో సభ్యుల ఓట్లతో చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవిని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దక్కించుకుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలోని 11 మంది కౌన్సిలర్లు సోమవారం యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతిని కలిసి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందునే నోటీసు ఇచ్చామని ఇటీవలే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరిన గుండ్లపల్లి వాణి తెలిపారు. విషయం తెలుసుకున్న చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ సుధ సుధ హుటాహుటిన డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నానని ఆరోపించడం సరికాదన్నారు. తనకు ఎమ్మెల్యే గొంగిడి సునీత అండగా ఉన్నారని, అవిశ్వాసం నుంచి తాను గట్టెక్కుతానని చెప్పారు. అయితే చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, ఆమె అండతోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 

మిగిలిన మున్సిపాలిటీల్లోనూ సేమ్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌

యాదాద్రి జిల్లాలోని మిగిలిన ఐదు మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాసం అంశం తెర మీదకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. -ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వస్పరి శంకరయ్యపై కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు సోమవారం మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతిని కలిసి అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. 9 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లకు తోడుగా ఇండిపెండెంట్, బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 

* భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లి మున్సిపాలిటీలో 13 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో 10, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 2, బీజేపీ ఖాతాలో ఒక వార్డు ఉంది. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ చిట్టిప్రోలు విజయలక్ష్మిపై అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారు. చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను తొలగించి కుడికాల అఖిలకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

* భువనగిరి చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎనబోయిన ఆంజనేయులుపై వ్యతిరేకతతో ఇక్కడి కౌన్సిలర్లు కూడా ఏకమైనట్లు తెలుస్తోంది. చైర్మన్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవిని ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

* మోత్కూరు చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ తీపిరెడ్డి సావిత్రి భర్త మేఘారెడ్డి ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. అయితే విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌ అంతా తాను చూసుకుంటానని కౌన్సిలర్లను సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ క్షణమైనా అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు 8 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

* మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ వెన్‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు, ముగ్గురు సీపీఎం కౌన్సిలర్ల మద్దతు కూడా తనకే ఉందని తన పదవికి ఢోకా లేదని రాజు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కూసుకుంట్ల ఓకే అంటే చైర్మన్‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లంతా బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి 8 మంది ఉన్నారు.