
మంచిర్యాల, వెలుగు: ప్రతి న్యాయవాదికి క్రమశిక్షణ ముఖ్యమని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ మెంబర్స్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఓ హోటల్లో నిర్వహించిన ట్రైనింగ్ క్లాసులకు ఆయన హాజరై మాట్లాడారు. చట్టాలపై అవగాహన లేకుండా వృత్తిలో విజయం సాధించలేరని, సామాజిక బాధ్యతతో కక్షిదారులకు న్యాయం చేయాలన్నారు.
దేశంలో, న్యాయవ్యవస్థలో రోజూ అనేక కొత్త చట్టాలు వస్తున్నాయని, వాటి పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, న్యాయవాది రాజేశ్ గౌడ్, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజీ, జాడి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి శైలజ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.