ఎమ్మెల్యే మాణిక్ రావుకు ఫిట్టింగ్ పెడ్తుందెవరు?

ఎమ్మెల్యే మాణిక్ రావుకు ఫిట్టింగ్ పెడ్తుందెవరు?

జహీరాబాద్ లో సిట్టింగ్  ఎమ్మెల్యే మాణిక్ రావుకు ఫిట్టింగ్ పెట్టే కార్యక్రమం ఫిక్స్ అయిందంట. ఈసారి టికెట్ దక్కపోవచ్చనే ప్రచారం సొంత పార్టీలోనే జరుగుతోంది. జనంలో ఉండరని, పార్టీపై పట్టు లేదని క్యాడరే ఎమ్మెల్యేపై చర్చించుకుంటున్నారట. మాణిక్ రావు బదులుగా మరో నేతను జహీరాబాద్ లో నిలబెడతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇదే టైమ్ లో జహీరాబాద్ పై రాష్ట్ర మెడికల్  సర్వీసెస్ , ఇన్ ఫ్రాస్ట్రక్చర్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  చైర్మన్  ఎర్రోళ్ల శ్రీనివాస్ కన్నేసినట్టు డిస్కషన్ జరుగుతోంది. 2018లోనే ఎర్రోళ్లకే టికెట్ వస్తుందన్న ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మాణిక్ రావు పేరు ప్రకటించారు. ఈసారి మాత్రం తనకే టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారట ఎర్రొళ్ల శ్రీనివాస్.

ఈ మధ్య ఎక్కువగా జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఎర్లోళ్ల శ్రీనివాస్ కనిపిస్తున్నారని క్యాడర్ చెప్పుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు కార్యక్రమాలు జహిరాబాద్ లో ఉంటే చాలు...ఎర్రోళ్ల శ్రీను అక్కడ వాలిపోతున్నారట. నియోజకవర్గంలో కార్యకర్తల, నేతల ఇళ్లల్లో పెళ్లిల్లైనా, ఏదైన ఫంక్షన్ జరిగినా ఎర్రోళ్ల అటెండెన్స్ వేసుకుంటున్నారట. మంత్రి హరిష్ రావు ఆశీర్వాదంతోనే ఎర్రోళ్ల శ్రీనివాస్..ఈసారి జుహీరాబాద్ టికెట్ తెచ్చుకుంటారని చెప్పుకుంటున్నారు నియోజకవర్గ నేతలు. 

ఎర్రొళ్ల శ్రీనివాస్ వ్యవహారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే టెన్షన్ పడుతున్నారంట. ఇప్పటికైనా స్థానిక నేతలపై పట్టు సాదించలేకపోయాడంట ఎమ్మెల్యే. పార్టీలో సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లీడర్లు, కార్యకర్తలు బాధపడుతున్నారట. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినా గ్రూపుల లొల్లిని మాణిక్ రావు కంట్రోల్ చేయలేకపోయారట. ఇద్దరు స్థానిక నేతల సమస్యనే పరిష్కరించలేకపోతే..ఎట్ల అని ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారంట కేడర్. అందుకే మాణిక్ రావుకు ఈసారి టికెట్ వచ్చే చాన్స్ లేదనే చర్చ వస్తోందంట. ఇదే అదనుగా ఎర్రొళ్ల శ్రీను ఎంట్రీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. శ్రీనుతో పాటు ఇతర ప్రాంత నేతలు, ఇతర పార్టీల్లోని లీడర్లు కూడా  టికెట్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. టికెట్ వేటలో స్థానిక నేతలతో దోస్తీ పెంచుకుంటున్నారట లీడర్లు.

https://www.youtube.com/watch?v=NxRRyBM2Bi8