దిశ నిందితుల ఎన్ కౌంటర్ : పోలీసులపై దాడి చేశారు: సీపీ సజ్జనార్

దిశ నిందితుల ఎన్ కౌంటర్ : పోలీసులపై దాడి చేశారు: సీపీ సజ్జనార్

దిశ నిందితులపై జరిగిన ఎన్ కౌంటర్ పై సీపీ సజ్జనార్ స్పందించారు. లైంగిక దాడి హత్యకు గురైన దిశ కేసులో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి, నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ను ఏర్పాటు చేయడంతో పాటు..ఏడురోజుల కష్టడీకి అనుమతించింది. తొలిరోజుల కష్టడీలో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. కనపించడకుండా పోయిన దిశా ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిశాఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ..సజీవ దహనం చేసిన చటాన్ పల్లి బ్రిడ్జీ వద్దకు నిందితుల్ని పోలీసులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి అవ్వడంతో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు.
అయితే ఈ ఎన్ కౌంటర్ పై సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఏడురోజుల కష్టడీలో పోలీసులు కేసును రీకన్ట్రక్షన్ చేసే పనిలో భాగంగా చటాన్ పల్లిలో దిశను సజీవదహనం చేసిన బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. రాళ్లతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు సజ్జనార్ నిర్ధారించారు.

అర్ధరాత్రే కేసును ఎందుకు రీకన్సక్ట్రన్ చేయాల్సి వచ్చింది..?

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సంబంధించి కేసును పగలు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తే నిందితుల్ని ప్రజలే కొట్టిచంపేస్తారని అనుమానంతో పోలీసులు అర్ధరాత్రి రీకనస్టక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా పోలీసులు అర్ధరాత్రి నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రీకనస్ట్రక్షన్ జరుగుతుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులపై ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు.

ఆధారాలున్నాయ్ 

అయితే కేసు కోర్ట్ పరిధిలో ఉందికాబట్టి నిందితులు ఎలా తప్పించుకున్నారు..?తప్పించుకునేందుకు పోలీసులపై ఎలా దాడి చేశారనే ఆధారాల్ని పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కు సమర్పించనున్నారు.