కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీకి రెడీ అయ్యిందట

కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీకి రెడీ అయ్యిందట

వరుణ్ తేజ్ ‘లోఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని తర్వాత బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో వరుస ఆఫర్స్‌‌‌‌‌‌‌‌తో దూసుకుపోతోంది. తాజాగా కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీకి కూడా రెడీ అయ్యిందట. అందులోనూ తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే చాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో  సూర్య ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్  సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని నిన్న చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా దిశా పటాని పేరును అఫీషియల్‌‌‌‌‌‌‌‌గా అనౌన్స్ అయితే చేయలేదు కానీ.. తన పేరు ట్యాగ్ చేయడంతో కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేసుకుంటున్నారు కోలీవుడ్ జనం. నిజానికి ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డేని సెలెక్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా దిశా పటాని పేరు తెరపైకి వచ్చింది. సూర్యకిది నలభై రెండవ సినిమా. ఇదొక పీరియాడికల్ మూవీ. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు దిశా పటాని రెండు హిందీ సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’లోనూ నటిస్తోంది.