రెండు అంశాల ఆధారంగా కేసీఆర్ పిటిషన్ కొట్టివేత 

రెండు అంశాల ఆధారంగా కేసీఆర్ పిటిషన్ కొట్టివేత  

విద్యుత్ కమిషన్ ను  రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసీఆర్ తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు సమర్థించింది. విచారణను కొనసాగించవచ్చంటూ ధర్మాసనం పేర్కొంది. అయితే రెండు అంశాల ఆధారరంగా  కేసీఆర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై విచారించేందుకు.. విచారణ కమిషన్‌కు అర్హత ఉందంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా  జస్టిస్ నరసింహారెడ్డి తీరు పక్షపాతంగా ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంది హైకోర్టు.. ప్రొసీడింగ్స్ చెప్పేందుకే ప్రెస్‌మీట్‌ పెట్టారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యనించింది.  ఒక చీఫ్ జస్టిస్ హోదాలో పని చేసిన వ్యక్తిపై.. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు సమర్పించాలని హైకోర్టు సూచించింది.  విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల గురించి.. తెలుసుకునేందుకే కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని కోర్టు వ్యా్ఖ్యనించింది.  కాగా  విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల ఏర్పాటులో జరిగిన అవకతవకలపై విచారణ కోసం రేవంత్ సర్కార్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.