ఇద్దరు రైతుల సూసైడ్​

ఇద్దరు రైతుల సూసైడ్​
  • పంట దెబ్బతినిందని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు 
  • నిర్మల్‌‌ జిల్లాలో ఘటనలు

కడెం/పెంబి, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట దెబ్బతినడంతో ఒకరు, అప్పుల బాధతో మరొకరు సూసైడ్ చేసుకున్నారు.  నిర్మల్‌‌ జిల్లా కడెం మండలం కల్లెడకు చెందిన బీర్పూర్ లచ్చన్న (46)కు రెండు ఎకరాల మామిడి తోట ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట మొత్తం నేల రాలడంతో రూ.1.5 లక్షల నష్టం వచ్చింది. ఇదివరకే రూ.10 లక్షలు అప్పు ఉండటం, ఇప్పుడు పంట నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్తాపం చెందాడు.

సోమవారం రాత్రి బయటకు వెళ్లిన లచ్చన్న.. తమ పాత ఇంట్లో ఫ్యాన్‌‌కు ఉరేసుకొని కనిపించాడు. జిల్లాలోని పెంబి మండలం గుమ్మెన గ్రామానికి చెందిన అత్రం మాన్కు (55) తనకున్న భూమితో పాటు కౌలుకు తీసుకున్న పొలంలో పత్తి సాగు చేశాడు. దిగుబడి ఆశించినంతగా రాలేదు. పెట్టుబడికి చేసిన రూ.5 లక్షల అప్పు ఎలా తీర్చాలోనన్న బెంగతో మంగళవారం తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.