
ములుగు, వెలుగు: పేద విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి ఇబ్బందిపడకూడదనే ఉద్దేశ్యంతో సైకిళ్లను పంపిణీ చేశామని రోటరీ ఇంటర్నేషనల్ 3150 జిల్లా గవర్నర్ రాంప్రసాద్ అన్నారు. బుధవారం ములుగులోని కెఎంఆర్ గార్డెన్స్ లో హెల్ప్ టూ నీడి అనుబంధంగా రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో100 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువు కొనసాగించాలన్నారు.
సమయానికి స్కూల్కు వెళ్లడానికి సైకిల్దోహదపడుతుందన్నారు. భవిష్యత్బాగుండాలంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడమే మార్గమని సూచించారు. అసిస్టెంట్ గవర్నర్ దాస జగదీశ్వర్, రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ కార్యదర్శి సాయి రెడ్డి, కోశాధికారి బాలకృష్ణ, రోటరీ చైర్మన్లు కొడాలి చంటి, కర్ణాకర్ రెడ్డి, హెల్ప్ టూ నీడి ఉపాధ్యక్షుడు కుక్కల బాబు గౌడ్, పూర్వ అధ్యక్షుడు పాల్గొన్నారు.