పెద్దపల్లి జిల్లాలో లక్కీ డ్రాతో డబుల్ ఇళ్ల పంపిణీ.. ఆందోళన 

పెద్దపల్లి జిల్లాలో లక్కీ డ్రాతో డబుల్ ఇళ్ల పంపిణీ..  ఆందోళన 

పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మొదలయింది. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అమర్ చంద్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. అయితే, లబ్ధిదారులందరి పేర్లను కలిపి లాటరీ పద్దతి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. 

కళ్యాణ మండపం సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు  బారులు తీరారు. ఈ పథకంలో మొత్తం 1050 మంది అర్హుల ఉండగా లాటరీ పద్దతి ద్వారా 484 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అధికారులతో లబ్ధిదారులంతా వాగ్వాదానికి దిగారు. లక్కీ డ్రా తీస్తే మిగిలిన వాళ్లంతా ఏమైపోవాలని మండిపడ్డారు. లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.