అమ్మ ఆదర్శ స్కూల్​లో రిపేర్లు పూర్తి చేయాలి : ప్రతిమ సింగ్

అమ్మ ఆదర్శ స్కూల్​లో రిపేర్లు పూర్తి చేయాలి : ప్రతిమ సింగ్

ఆమనగల్లు, వెలుగు: అమ్మ ఆదర్శ స్కూల్​లో జరుగుతున్న రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం మాడ్గుల్ మండలంలోని గిరికొత్తపల్లి స్కూల్​ను సందర్శించి రిపేర్​పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్కూల్​ప్రారంభం నాటికి రిపేర్లు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో సరస్వతి, ఎంపీవో వేజన్న, ఎంఈరవో సర్దార్ నాయక్, ఏఈ సూర్య వంశీ పాల్గొన్నారు.