మహబూబాబాద్ అర్బన్/ తొర్రూరు, వెలుగు: చట్టాలపై ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా సివిల్ జడ్జి తిరుపతి, తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సరిత అన్నారు. శనివారం మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో, తొర్రూరు పట్టణంలోని మైనార్టీ స్కూల్లో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సందస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జడ్జిలు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు తలెత్తితే అధైర్య పడకుండా చట్టం కల్పించిన హక్కుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం, పాఠశాల ప్రిన్సిపాల్ వనజ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.