గర్భిణి కాన్పు తేదీ ప్రకారం డెలివరీ క్యాలెండర్ రూపొందించాలి : కలెక్టర్ సంతోష్

గర్భిణి కాన్పు తేదీ ప్రకారం డెలివరీ క్యాలెండర్ రూపొందించాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: గర్భిణి కాన్పు తేదీ  ప్రకారం డెలివరీ క్యాలెండర్ ను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం ధరూర్ మండలంలోని ఉప్పెరు హాస్పిటల్, ఆయుష్మాన్ ఆరోగ్య హాస్పిటల్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, కాన్పుల, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతి రిజిస్టర్ లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. హాస్పిటల్ కు ఎంతమంది రోగులు వస్తున్నారు ఇన్ పేషెంట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

 అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.  సర్కార్ దవాఖానాలలో కాన్పుల సంఖ్యను గణనీయంగా పెంచాలన్నారు.  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉప్పెర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు ఒక అంబులెన్స్ త్వరలోనే కేటాయించాలన్నారు.  కలెక్టర్ వెంట ఇన్ ఛార్జి డీఎంహెచ్‌‌‌‌ఓ  సిద్ధప్ప, డాక్టర్లు రాజు, కృష్ణవేణి ఉన్నారు.