V6 News

నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలి : గరిమా అగ్రవాల్

 నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలి : గరిమా అగ్రవాల్
  • జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్న కోనరావుపేట, చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు.

 బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంకు ఇతర సామగ్రి సరిచూసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అడిషనల్‌ కలెక్టర్ నగేశ్‌, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాధాబాయ్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీవీహెచ్ఓ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పాల్గొన్నారు. 

జడ్పీ సీఈవోకు గాయాలు  

మొదటి విడత ఎలక్షన్‌లో భాగంగా వేములవాడ అర్బన్‌ మండల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌‌ వద్ద జడ్పీ సీఈవోకు గాయాలయ్యాయి. బీపీ డౌన్ కావడంతో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో తలకు గాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించారు.