నిర్మల్, వెలుగు: ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) ఆధ్వర్యంలో ఈనెల 9న నిర్మల్‌జిల్లా సిర్గాపూర్ లోని ఫ్లెయిర్ హైస్కూల్లో జిల్లాస్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భోజన్న మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాషాభివృద్ధికి ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు ఎల్టా ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయ మన్నారు.
ఎల్టా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ ఇటీవల మండల, పట్టణ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారని.. జిల్లాస్థాయిలో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఎల్టా బాధ్యులు చంద్రశేఖరరావు, రతన్ కుమార్, సెక్టోరల్ ఆఫీసర్లు నర్సయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
