- జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి ఉమ మహేశ్వర్ రావు
బోధన్, వెలుగు: మైనర్లు వాహనాలు నడపడం చట్టారీత్యా నేరమని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి ఉమ మహేశ్వర్ రావు అన్నారు. బుధవారం బోధన్ పట్టణశివారులోని ఇందూర్ హైస్కూల్ లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 18సంవత్సారాల వయస్సులోపు ఉన్నా బాలలు వాహనం నడిపితే ఆ బాలుడికి జువనైల్ హోంకు పంపడమేకాకుండా.. అతని తండ్రికి మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు.
విద్యార్థులు రోడ్లపై వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రోడ్డు ప్రమాదాలు నివారించాలని సూచించారు. అలాగే లైసెన్సు ఉన్న వారు కారు నడిపితే బెల్టు పెట్టుకోవాలని, బైక్ నడిపితే హెల్మెంట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపవద్దని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.
ఈకార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్, ఎంవీఐ శ్రీనివాస్, బోధన్ ట్రాస్మా అధ్యక్షుడు హరికృష్ణ, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రామారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
