అంగన్వాడీ కేంద్రాల తనిఖీ

అంగన్వాడీ కేంద్రాల తనిఖీ

నకిరేకల్, (వెలుగు) : మండలంలోని చందుపట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం జిల్లా సంక్షేమ అధికారిని సక్కుబాయి  తనిఖీ చేశారు.  పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, అంగన్వాడీ కేంద్రాల పని తీరును పర్యవేక్షించారు. మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని  సూచించారు.  

అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లలు  భోజనం చేసే విధంగా చూడాలన్నారు.  ఆమె వెంట సీడీపీఎం అగసరా అన్‌‌జుమ్‌‌, సూపర్‌‌ వైజర్‌‌ సునిత, అంగన్వాడీ టీచర్లు నాగమణి, సూర్యకళ తదితరులు ఉన్నారు.