సర్పంచుల నిధులు మళ్లించడం క్రిమినల్ చర్య: జీవన్ రెడ్డి

సర్పంచుల నిధులు మళ్లించడం క్రిమినల్ చర్య: జీవన్ రెడ్డి

కరీంనగర్: సర్పంచుల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేస్తే.. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ద్వారా వాటిని దారి మళ్లించడం క్రిమినల్ చర్య అవుంతుదని ఆయన చెప్పారు. నిధులు మళ్లించడంలో పాత్ర ఉన్న అధికారులందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. 

దీనిపై అవసరమైతే తాము కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే సర్పంచులకు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... రాష్ట్రం చేసిన ఈ పనితో పంచాయితీలు, సర్పంచులు మరింత ఇబ్బంది పడే ప్రమాదముందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిందిపోయి నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.