యాదగిరిగుట్టలో వైభవంగా దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్టలో వైభవంగా దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రాత్రి ప్రధానాలయ మాడవీధుల్లో  దివ్యవిమాన రథోత్సవం నిర్వహించారు. ఉదయం శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై విహరించిన లక్ష్మీసమేత నారసింహుడు.. సాయంత్రం దివ్యరథంలో ఆసీనుడై భక్తులను కనువిందు చేశారు. రథం ముందు చేసిన చెక్క, చిడత భజనలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవం ముగిసే వరకు రథం ముందు యువకులు చేసిన డాన్సులు ఆనందపరవశుల్ని చేశాయి. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని జరపనున్నారు.