దీపావళి సెలవు సోమవారం.. అధికారికంగా ప్రకటించిన ఏపీ

 దీపావళి సెలవు సోమవారం.. అధికారికంగా ప్రకటించిన ఏపీ

దీపావళి సెలవు ఆదివారం కాదు.. సోమవారం.. నవంబర్ 13వ తేదీ అని డిక్లేర్ చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఆదివారం 12వ తేదీగా ప్రకటించిన సర్కార్.. పండితుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలతో.. తిధి ప్రకారం 13వ తేదీని జనరల్ హాలిడే డిక్లేర్ చేస్తూ.. నవంబర్ 6వ తేదీ ప్రత్యేకంగా జీవో జారీ చేసింది సీఎం జగన్ ప్రభుత్వం.

పంచాంగం ప్రకారం నవంబర్ 12న ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య  ఉంది. అయితే అమావాస్య సూర్యోదయం మాత్రం 13వ తేదీన ఉంది. సోమవారం మధ్యాహ్నం వరకు దీపావళి ఘడియలు ఉన్నాయి. తిధి రెండు రోజులు రావటంతో.. పండుగ ఎప్పుడు చేసుకోవాలనే డైలమా నెలకొంది జనంలో.  దీపావళి రాత్రి వేడుక.. అమావాస్య చీకట్లు రాత్రి సమయంలోనే ఉండటంతో.. దేశ ప్రజలు 12వ తేదీ ఆదివారం పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే కొన్ని పంచాంగాలు, తిధి ప్రకారం చూస్తే.. 13వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పండుగ సెలవును రీ షెడ్యూల్ చేసింది. 12వ తేదీ ఆదివారం కావటంతో. .13వ తేదీ సోమవారాన్ని జనరల్ హాలిడే.. దీపావళి సెలవుగా ప్రకటించింది. సో.. ఏపీలో దీపావళి సెలవు ఉంది.. 

తెలంగాణ ప్రభుత్వం మాత్రం క్యాలెండర్ ప్రకారం ఆదివారమే దీపావళి సెలవుగా నిర్ణయించింది.