
మద్నూర్, వెలుగు : తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్అయిన నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ప్రభుత్వం పూర్తి చేయలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. జుక్కల్బీజేపీ అభ్యర్థి అరుణతార సోమవారం నామినేషన్వేస్తున్న సందర్భంగా సోమవారం డీకే అరుణ మద్నూర్కు వచ్చారు. నామినేషన్ ముగిసిన అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. మేడిగడ్డ, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లోనూ భారీ అవినీతి జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే సాధ్యం కాలేదన్నారు. ఆంధ్రా పెత్తందారులతో కొట్లాడిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నియంత కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధం కావాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్సర్కార్తో పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. జుక్కల్ఎమ్మెల్యే అభ్యర్థి అరుణతార, అసెంబ్లీ కన్వీనర్శ్రీధర్కులకర్ణి, బిచ్కుంద మండలాధ్యక్షులు కిష్టారెడ్డి, జగ్మోహన్తదితరులు పాల్గొన్నారు.