న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు లో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. శనివారం ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) అధికారులు నోటీసులు ఇవ్వడంతో తాను ఆశ్చర్యపోయానని డీకే చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఈడీకి ఇదివరకే అన్ని వివరాలు ఇచ్చామని, అయినా వారు నోటీసులు అందజేశారని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో సోనియా, రాహుల్, వారి మద్దతుదారులను కేంద్రం లక్ష్యంగా చేసుకుందన్నారు. ‘‘నోటీసులు ఇవ్వడం వేధింపుల కిందకే వస్తుంది. ఇది మా డబ్బు.. మేం ట్యాక్స్‌లు చెల్లించినప్పుడు మాకు నచ్చిన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు”అని డీకే వెల్లడించారు
