
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మంచి ఫుడ్ పెడుతున్నారా? సౌలతులు సక్రమంగా ఉన్నాయా? అని డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర ఆరా తీశారు. నగరంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాన్ని శుక్రవారం తనిఖీ చేశారు.
హోమ్‌లో ఉంటున్న పిల్లలతో, నిర్వాహకులతో మాట్లాడారు. చిన్నారులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. జిల్లా అధికారులతో మాట్లాడి అవసరమైన సౌలతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.