నవీపేట్ మండలంలోని సబ్ సెంటర్లను తనిఖీ చేసిన డీఎంహెచ్ వో

నవీపేట్ మండలంలోని సబ్ సెంటర్లను తనిఖీ చేసిన డీఎంహెచ్ వో

నవీపేట్, వెలుగు: నవీపేట్ మండలంలోని సబ్ సెంటర్లు,  మెడికల్ కాలేజ్ కు అనుబంధంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్ గురువారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఉదయం కోస్లీ గ్రామంలో సబ్ సెంటర్ పరిశీలించగా ఏఎన్ఎం జమున అందుబాటులో లేకపోవడంతో పాటు డ్యూటీ కి సమయపాలన పాటించకపోవడంతో మెమో జారీ చేయాలని మెడికల్ ఆఫీసర్ నవ్యను ఆదేశించారు.  నాగేపూర్ సబ్ సెంటర్ నవీపేట్ లో జిల్లా మెడికల్ కాలేజ్ కి అనుబంధం గా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రిజిస్టర్ పరిశీలించారు.  డెలివరీల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు.  మెడికల్ ఆఫీసర్ నవ్య, సూపర్ వైజర్ కిషన్ వెంకటేశ్వర్లు, ఏ ఎన్ ఎం లు ఉన్నారు.