శిశువుల తారుమారు ఘటనలో వీడిన చిక్కుముడి

శిశువుల తారుమారు ఘటనలో వీడిన చిక్కుముడి

మంచిర్యాల జిల్లాలో శిశువుల తారుమారు ఘటనలో చిక్కుమూడి వీడింది. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సమక్షంలో సీల్డ్ కవర్‭లోని DNA రిపోర్టును వైద్యశాఖ అధికారులు విడుదల చేశారు. చెన్నూరు మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన మమతకు కూతురు జన్మించినట్లుగా అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పావనికి కొడుకు పుట్టినట్లుగా ధృవీకరించారు. DNA రిపోర్ట్ రావటంతో... మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ఇరువురి తల్లిదండ్రులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ హరిచంద్రరెడ్డి శిశువులను అందించారు. 

మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 28న 10 నిమిషాల వ్యవధిలో ఇద్దరు శిశువులు జన్మించారు. ఒకరి శిశువును మరొకరికి అప్పగించిన నర్సులు కొద్దిసేపటికే తేరుకుని శిశువుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అప్పటికే శిశువుల తల్లిదండ్రులు తమకు బాబు పుట్టాడంటే తమకు బాబు పుట్టాడంటూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ పాప తారుమారు అయినట్లు గొడవకు దిగారు. దీంతో ఇద్దరి శిశువులకు సంబంధించి DNA టెస్ట్ చేసిన అధికారులు... ఇవాళ రిపోర్టును ఓపెన్ చేశారు.