
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం 10 గేట్లు ఎత్తడంతో డ్యాం పరిసరాలు ఆహ్లాదంగా మారాయి. దీంతో కరీంనగర్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డ్యాంను చూసేందుకు భారీగా తరలివచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. డ్యాం 10 గేట్లు ఎత్తి సుమారు 30వేల క్యూసెక్కుల వరదను కిందికి వదులుతున్నారు. -వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్