యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిలయ్యిందా? భయపడొద్దు

యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిలయ్యిందా? భయపడొద్దు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు:  దేశంలో డిజిటల్ పేమెంట్స్‌‌ వేగంగా పెరుగుతున్నాయి. యూనిఫైడ్‌‌ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌ఫేజ్‌‌(యూపీఐ), ఇమిడియేట్‌‌ పేమెంట్ సర్వీస్‌‌(ఐఎంపీఎస్‌‌), రియల్‌‌ టైమ్‌‌ గ్రాస్‌‌ సెటిల్‌‌మెంట్స్‌‌(ఆర్‌‌‌‌టీజీఎస్‌‌), కార్డులు, ఏటీఎం టూ ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఊపందుకున్నాయి. ఇదే టైమ్‌‌లో డిజిటల్ ట్రాన్సాక్షన్ల ఫెయిల్యూర్స్‌‌ కూడా ఎక్కువయ్యాయి. కస్టమర్ల అకౌంట్లలో డబ్బులు కట్ అవుతున్నాయి. కానీ, బెనిఫిషరీ అకౌంట్‌‌లకు యాడ్ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కట్‌‌ అయిన అమౌంట్ కొంత టైమ్‌‌ పిరియడ్‌‌లో ఆటోమెటిక్‌‌గా తిరిగి కస్టమర్‌‌‌‌ అకౌంట్‌‌కు యాడ్ కావాలి. సెప్టెంబర్‌‌‌‌ 19, 2019 లో ఆర్‌‌‌‌బీఐ ఇచ్చిన  సర్క్యూలర్ ప్రకారం ఈ టైమ్ పిరియడ్‌‌ దాటినా, అమౌంట్ రిఫండ్ కాకపోతే బ్యాంకులు కస్టమర్లకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.  ట్రాన్సాక్షన్ జరిగిన విధానం బట్టి ఈ టైమ్‌‌ పిరియడ్‌‌లో తేడాలున్నాయి.

ఏప్రిల్‌‌ 1 న పెరిగిన ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్‌‌... 
ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కావడంతో ఏప్రిల్‌‌ 1 న బ్యాంకులు పనిచేయలేదు. దీంతో నెఫ్ట్‌‌, ఐఎంపీఎస్‌‌, యూపీఐ ల ద్వారా జరిగిన చాలా ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయి. ‘ఏప్రిల్‌‌ 1 న కొన్ని బ్యాంకులు వలన యూపీఐ, ఐఎంపీఎస్‌‌ ట్రానాక్షన్లలో కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ సర్వీస్‌‌లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్నాయి’ అని నేషనల్‌‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్‌‌(ఎన్‌‌పీసీఐ)  ట్విటర్‌‌‌‌లో పేర్కొనడం విశేషం. కానీ, ఫెయిలైన ట్రాన్సాక్షన్ల డబ్బులు ఇంకా తిరిగి బ్యాంక్‌‌ అకౌంట్‌‌కు యాడ్‌‌ కాలేదని కొంత మంది కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రాన్సాక్షన్లు ఫెయిలయ్యి రెండు రోజులవుతున్నా ఇంకా డబ్బులు రిఫండ్ అవ్వలేదని పేర్కొంటున్నారు. నెఫ్ట్‌‌, ఆర్‌‌‌‌టీజీఎస్‌‌, ఐఎంపీఎస్‌‌, యూపీఐల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లు ఫెయిల్‌‌ అయితే, అమౌంట్‌‌ కొంత టైమ్‌‌ పిరియడ్‌‌లో ఆటోమెటిక్‌‌గా రిఫండ్‌‌ అవ్వాల్సి ఉంది. ఈ టైమ్‌‌ పిరియడ్‌‌లోపు అమౌంట్ రిఫండ్ కాకపోతే, అక్కడి నుంచి రోజుకి రూ. 100  చొప్పున బ్యాంకులు కస్టమర్లకు పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకులకు రోజుకి రూ. 100 పెనాల్టీ..
ఆర్‌‌‌‌బీఐ ఇష్యూ చేసిన సర్క్యూలర్ ప్రకారం ..ఐఎంపీఎస్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ఫెయిలయ్యిందనుకుందాం. కస్టమర్‌‌‌‌ అకౌంట్‌‌ నుంచి డబ్బులు కట్‌‌ అయ్యాయి కానీ, బెనిఫిషరీ అకౌంట్‌‌లో యాడ్ కాలేదు. ఇలాంటి పరిస్థితులలో కట్ అయిన అమౌంట్ టీ+1 రోజులో కస్టమర్‌‌‌‌ అకౌంట్‌‌కు  రిఫండ్ కావాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు ట్రాన్సాక్షన్ ఫెయిలైతే తర్వాతి వర్కింగ్ డే చివరినాటికి డబ్బులు రిఫండ్ కావాలి. ఈ టైమ్‌‌ పిరియడ్‌‌ దాటితే రోజుకి రూ. 100 చొప్పున బ్యాంకులు కస్టమర్‌‌‌‌కు పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిలైనా టీ+1 రోజులో డబ్బులు రిఫండ్ కావాలి. ఈ టైమ్‌‌ పిరియడ్‌‌ దాటినా ఇంకా డబ్బులు రిఫండ్ అవ్వకపోతే, సర్వీస్‌‌ను అందించే యాప్‌‌ లేదా ప్రొవైడర్ల వద్ద కస్టమర్లు ఫిర్యాదును ఫైల్ చేయాలి. నెల రోజులైనా ఈ సమస్య పరిష్కారం కాకపోతే, అంబుడ్స్‌‌మన్‌‌కు ఈ సమస్యను తీసుకువెళ్లాలి.

ట్రాన్సాక్షన్ విధానం బట్టి వేరు వేరు సెటిల్‌‌మెంట్ టైమ్‌‌ పిరియడ్‌‌ను ఆర్‌‌‌‌బీఐ ఇచ్చింది. ఆటో రిఫండ్‌‌ టైమ్‌‌పిరియడ్‌‌, ఫెయిలైతే పెనాల్టీ కింద ఎంత చెల్లిస్తారో కింద ఉన్నాయి..
1 ఏటీఎం, మైక్రో ఏటీఎంల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లు ఫెయిలైతే, కట్‌‌ అయిన అమౌంట్‌‌ టీ+5 (పేమెంట్‌ అయిన రోజు+5 రోజులు)రోజుల్లో  తిరిగి పడాలి. ఈ టైమ్‌‌ తర్వాత రోజుకి రూ. 10‌‌‌‌0 కస్టమర్‌‌‌‌కు పెనాల్టీగా బ్యాంకులు చెల్లించాలి.
2 కార్డు–కార్డు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ అయితే, టీ+1 రోజులో రిఫండ్ అవ్వాలి. లేకపోతే బ్యాంకులు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
3 పీఓఎస్‌‌ల వద్ద డబ్బులు కట్‌‌ అయినా, ట్రాన్సాక్షన్ జరగకపోతే, టీ+5 రోజుల్లో డబ్బులు రిఫండ్ అవ్వాలి. 
4  ఐఎంపీఎస్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ఫెయిలైతే, కట్‌‌ అయిన అమౌంట్‌‌ టీ+1 రోజుల్లో తిరిగి అకౌంట్‌‌లో పడాలి. టీ+1 తర్వాత రోజుకి రూ. 100 పెనాల్టీని బ్యాంకులు చెల్లిస్తాయి.
5 మర్చంట్లకు యూపీఐ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్‌‌ ఫెయిలైతే, టీ+5 రోజుల్లో అమౌంట్ రిఫండ్ అవ్వాలి. లేకపోతే బ్యాంకులు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
6 ఆధార్ ఎనబుల్డ్‌‌ పేమెంట్ ఫెయిలైతే, కట్ అయిన అమౌంట్‌‌ టీ+5 రోజుల్లో కస్టమర్‌‌‌‌ అకౌంట్‌‌కు యాడ్ అవ్వాలి. ఈ టైమ్ పిరియడ్‌‌ తర్వాత రోజుకి రూ.100 చొప్పున పెనాల్టీ కింద బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది.