Good Food : ఎంత తిన్నా.. ఇంకా ఆకలి వేస్తుందా.. ఇలా చేయండి

Good Food : ఎంత తిన్నా.. ఇంకా ఆకలి వేస్తుందా.. ఇలా చేయండి

ఆరోగ్యంగా ఉండాలంటే అందరికీ ఫుడ్ కావాలి. ఫుడ్ తీసుకోవడంలో ఎవరి అలవాటు వారిది. కానీ, కొందరికి ఎంత తిన్నా ఆకలి అవుతూనే ఉంటుంది. తిన్న కాపేపటికే మళ్లీ ఆకలి ఆవురావురుమంటుంది. అలాంటి వాళ్లకు ఒక్కోసారి చిరాకు, తలనొప్పి కూడా వస్తాయి. అయితే ఆకలి అనిపించడం సమస్య కాదు. కానీ, ఎంత తిన్నా ఆకలితో బాధపడుతుంటే ఈ మూడు టిప్స్ ఫాలో అయితే ఆ బాధ ఉండదు. 

ప్రొటీన్...

తినే తిండిలో ప్రొటిన్స్ లేకపోతే.. ఎంత తిన్నా అంతే సంగతి. అందుకే ఫుడ్ లో ప్రొటీన్లు ఇంపార్టెంట్. 'టెస్టిస్ ' అనే హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇది తక్కువ రిలీజ్ అవడం. వల్ల ఆకలివేస్తుంది. దీన్ని కంట్రోల్ చేసేవి ఫుడ్ లోని ప్రొటీన్లే. సో! రిచ్ ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తింటే... ఆకలిగా అనిపించదు. టైంకి తింటే సరిపోతుంది. రిచ్ ప్రొటీన్ ఫుడ్లో .. గుడ్లు, చేపలు, శనగలు, బాదం వెన్న, పల్లీ, గుమ్మడి గింజల్లో ఫ్యాట్ తక్కువ ఉండి ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. 

నిద్ర.. 

సరిగ్గా నిద్ర లేకపోతే హెల్త్ అన్ని రకాలుగా చెడిపోతుంది. బాడీ, ట్రెయిన్ సరిగ్గా పని చేయాలంటే సరైన నిద్ర ఉండాలి. తగినంత రెస్ట్ తీసుకోకపోతే.. శరీరం లిన్ అనే హంగర్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఆకలి తీవ్రంగా ఉంటుంది. రోజుకు ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రలేకపోతే.. నిండుకుండలా నిండిన పొట్టకి కూడా తిండి పెట్టాల్సిందే. 

ఫ్యాట్, ఫైబర్..

ఫుడ్ లోని ఫ్యాట్, ఫైబర్ గ్రెలిన్ రిలీజ్ ని తగ్గించి.. లెప్టిన్ స్థాయిని పెంచుతాయి. కాబట్టి ఫుడ్లో ఫైబర్, ఫ్యాట్ లేకపోతే ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. కొవ్వు, ఫైబర్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్, ఫ్యాట్ తప్పనిసరిగా ఉండాలి. ఆలివూనె, అవిసెగింజలు, బీన్స్, అవకాడో, బెర్రీలు, బ్రకోలీ, పాప్కార్న్, యాపిల్స్ లో తగినంత ఫ్యాట్, ఫైబర్ ఉంటుంది.