Health Alert: బాగా గురక పెడుతున్నారా.. అయితే వెంటనే డాక్టర్​ దగ్గరకు వెళ్లండి

Health Alert: బాగా గురక పెడుతున్నారా.. అయితే వెంటనే డాక్టర్​ దగ్గరకు వెళ్లండి

నిద్రలో కొన్ని లక్షణాలను గమనించినట్లయితే హార్ట్​ ప్రోబ్లమ్​ ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ లక్షణాలు  ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమందికి నిద్రలో గుండెపోటు వస్తుంది. నిద్రలో ఈ క్వాలిటీస్ కనిపిస్తే మీకు అధిక రక్తపోటు అని అర్థం. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం..

కొందరు నిద్రిస్తున్న సమయంలో విపరీతమైన సౌండ్ తో గురక పెడతారు. గురక అనేది ఇతరుల నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. అయితే గురక అనేది ఎందుకు వస్తుందంటే గాలి పీల్చుకునే సమయంలో శ్వాస నాళాలు మూసుకుపోవడం వల్ల బయటకు పంపే గాలి గొంతులోనికి వెళ్లి కంపింప చేస్తుంది. దీంతో సౌండ్ తో గురక వస్తుంది. ఈ గురక పెట్టే వారు కొందరు గట్టి శబ్దంతో పెడతారు. వారిలో అధిక రక్తపోటు సమస్య ఉన్నాట్లుగా చెప్పవచ్చు.కానీ ఈ గురక అనేది వారికి తెలియకుండానే వస్తుంది. ఈ గుండెపోటు సమస్యకు టైం తో పనిలేదు. ఏ సమయంలోనైన అటాక్ చేస్తుంది. నైట్ టైంలోనే కాకుండా పగలు కూడా కొంతమందికి గురక వస్తుంది. అయితే ఈ సమస్య అనేది గుండె పోటు ఉన్నవారిలో ఒక లక్షణం అని ఓ అధ్యయనంలో తేలింది.

మీరు తరచుగా తలనొప్పితో బాధపడుతున్నట్లైతే అది హార్ట్ ఎటాక్ కి కారణంగా చెప్పవచ్చు. ఒక రోజులో అధిక తలనొప్పి ఉంటే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతే కాదు సరైన నిద్ర లేకపోతే సాధరణంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఈ కారణాల వల్ల కూడ గుండె పోటు సమస్య వస్తుంది. నిద్రలో హఠాత్తుగా మేల్కోవ వచ్చిన, టెన్షన్ గా అనిపించిన అధిక రక్తపోటు ఉన్నట్లు.. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది.

ఈ మధ్యకాలంలో జనాలు గుండె జబ్బులతో బాధ పడుతున్నారు.  చిన్న పిల్లలు కూడా హార్ట్​ ప్రోబ్లమ్స్​ తో బాధ పడుతున్నారు. అంతేకాదు కొంతమంది జన్యుపరమైన లోపాల వల్ల పుట్టేటప్పుడే ఇలా బాధ పడుతూ జన్మిస్తున్నారు.  ఈ సమస్య ఎటు నుంచి వస్తుందో తెలియదు కాని... ఎంతటి వారినైనా కుప్ప కూలుస్తుంది.  ఈ సమస్య కొందరిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినపుడు విపరీతమైన నొప్పి తో వెంబడిస్తుంది. ఈ సమస్య సైలెంట్ గా వ్యక్తులపై దాడి చేసి చంపేస్తుంది.. దీనినే అధిక రక్తపోటు అంటారు.  దీంతో దృష్టి కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి .  ఇంకా మూత్రపిండాల పనితీరు దెబ్బతీస్తుంది. ఈ విధంగా మనకు తెలియకుండానే స్ట్రోక్ వస్తుంది.