ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..

 ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..

ఫ్రెండ్ షిప్, మ్యారేజ్ ఈ రెండూ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ . అలాగే ఇవి చాలా గట్టి బంధాలు కూడా. ప్రతి ఒక్కరికీ అవసరమైనవి కూడా. వీటిలో ఏది లేకపోయినా లైఫ్ కంప్లీట్‌గా అనిపించదు. కొంతమంది పెళ్లైతే ఫ్రెండ్ షిప్‌కి దూరం కావాల్సి వస్తుందన్న ఆలోచనతో బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటారు.

  • స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీస్తుంది. ఇద్దరు స్నేహితులు పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. అలాగని వాళ్ల రిలేషన్​లో ఎలాంటి ఒడిదుడుకులు రావని కాదు. వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో వాళ్లకి బాగా తెలుస్తుంది. 
  • అర్థం చేసుకునే ఛాన్స్​ ఎక్కువ. మామూలుగానే ఫ్రెండ్స్​ అన్నాక కమ్యూనికేషన్​ వెరైటీగా ఉంటుంది. కళ్లతో, సైగలతో మాట్లాడతారు. చాలా సందర్భాల్లో వాళ్లతో మాట్లాడకపోయినా వాళ్ల మనసులో ఉన్నదేంటో గ్రహించగలిగేది ఒక్క ఫ్రెండ్​ మాత్రమే. అందుకే ఫ్రెండ్​.. పార్ట్​నర్​ అయితే మనసు తెలుసుకోవడం ఈజీ అవుతుంది. అంతే కాదు, ఎంతమందిలో ఉన్నా మూగభాషలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. 
  • బెస్ట్ ఫ్రెండ్​ పార్ట్​నర్​ అయితే.. ఏ విషయాన్నైనా సూటిగా చెప్పేస్తారు. ఎలాంటి భయం ఉండదు. కోపంగా అయినా, ప్రేమగా అయినా మనసులో ఉన్న విషయాన్ని బయటపెడతారు. 
  • నిజాయితీ అనేది ఏ రిలేషన్​కైనా చాలా ఇంపార్టెంట్​. బెస్ట్​ ఫ్రెండ్స్​ మధ్య నిజాయితీ ఉంటుంది. బుజ్జగించడం, కన్విన్స్ చేయడం లాంటివి ఉండవు. ఏ రిలేషన్​ అయినా నిలబడటానికి నిజాయితీ చాలా ముఖ్యం. 
  • గొడవలు ప్రతి రిలేషన్​షిప్​లోనూ ఉండేవే. కాకపోతే వాటిని ఎలా ఆపగలమన్నది ఆలోచించాలి. చాలావరకు లైఫ్ పార్ట్​నర్​తో గొడవ పడితే ఎక్కువసేపు దాన్ని కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే వాళ్లు ఆ ఎడబాటును భరించలేరు. వెంటనే కలిసిపోతారు. మరి పార్ట్​నర్​ ప్లేస్​లో బెస్ట్ ఫ్రెండ్​ ఉంటే, గొడవ జరిగినంత టైం కూడా పట్టదు, మళ్లీ వాళ్లు కలిసిపోవడానికి.
  • భార్యాభర్తలన్నాక సర్దుకుపోవాలి అంటుంటారు. నిజమే. కానీ, బెస్ట్ ఫ్రెండ్​ని మ్యారేజ్​ చేసుకున్నవాళ్లకి ఎక్కువ కాలం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంతకుముందు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసు. కాబట్టి వాళ్ల ఫ్యామిలీస్​తో కలిసిపోవడానికి ట్రై చేసేటప్పుడు మాత్రమే అడ్జస్ట్​మెంట్​ అవసరం.
  • ఉదాహరణకి, ఏదైనా విషయం మీద ఒకరు చిరాకు పడితే.. వాళ్లను ఎలా కూల్​ చేయాలో ఫ్రెండ్​కి బాగా తెలుస్తుంది. పైగా నిమిషాల్లో నవ్విస్తారు. పార్ట్​నర్​ ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని అంగీకరిస్తే, అంతకంటే అర్థం చేసుకునేవాళ్లుండరు. వాళ్లను సపోర్ట్ చేయాలి. అంతేకానీ, చిరాకు తెప్పించే ప్రశ్నలు వేయకూడదు. 
  • ఫైనల్​గా పార్ట్​నర్స్​ బెస్ట్​ ఫ్రెండ్స్​లా ఉంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. బెస్ట్​ఫ్రెండ్స్​ పార్ట్​నర్స్​ అయితే ఇంకా బాగుంటుంది.