అల్లు అర్జున్ ఉత్తమ నటుడి ప్రైజ్ మనీ రూ.50 వేలు మాత్రమే

అల్లు అర్జున్ ఉత్తమ నటుడి ప్రైజ్ మనీ రూ.50 వేలు మాత్రమే

కేంద్రప్రభుత్వం ఆగస్టు 24న 69 జాతీయ అవార్డు(69 National awards)లను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో తెలుగు సినిమాల హవా నడిచింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగు సినిమాలకు ఏకంగా పది అవార్డులు దక్కాయి. అందులో ఆర్ఆర్ఆర్(RRR), పుష్ప(Pushpa), ఉప్పెన(Uppena), కొండపోలం(Kondapolam) వంటి సినిమాలున్నాయి. ఇక పుష్ప సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు అందుకొని రికార్డ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్(Allu arjun). 70 ఏళ్లుగా ఏ తెలుగు హీరో సాధించని ఘనతను సాధించడంతో అల్లు అర్జున్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.  

అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే.. నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతలకు నగదు ఎంత ఇస్తారు. అలాగే ఎలాంటి మెడల్ ఇస్తారు అని. జాతీయ అవార్డలను అందుకున్న విజేతలకు.. స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందిస్తారు. అంతేకాకుండా ప్రశంసా పత్రాలను కూడా అందజేస్తారు. 

ఇక ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ కు రూ.50 వేలతో పాటు రజత కమలం, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌లకు తలా రూ.50 వేల నగదు,రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌కు రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం. ఉత్తమ వినోద చిత్రంగా ఎంపికైన RRR సినిమాకు రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం. బెస్ట్ డైరెక్టర్​గా జాతీయ అవార్డు అందుకున్న నిఖిల్ మహాజన్‌కు రూ.2.50 లక్షల నగదు రజత కమలం. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్​కు రూ. 1.50 లక్షల నగదు రజత కమలం. జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా సినిమాకు రూ.2 లక్షల నగదు, రజత కమలం.