
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ సరదా ముచ్చట పంచుకున్నారు. “చాలా ప్రత్యేకమైన ఫ్రెండ్ నన్ను కలిసేందుకు పార్లమెంట్ కు వచ్చాడు” అనే కామెంట్ తో పాటు.. ఆ చిన్నారి బాలుడి ఫొటోలను పోస్ట్ చేశారు. క్యూట్ గా ఉన్న ఆ పిల్లాడితో మోడీ కాసేపు ఆడుకున్నారు. ఆ చిన్నోడికి చాక్లెట్లు ఇచ్చారు. సరదాగా గడిపారు. పిల్లాడితో ఆడుకుంటున్న 2 ఫొటోలను షేర్ చేశారు ప్రధాని మోడీ.
ఐతే.. ఆ పిల్లాడు ఎవరు అనేదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ చిన్న పిల్లోడు రాజ్యసభ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ సత్యనారాయణ్ జతియా మనవడు. మధ్యప్రదేశ్ కు చెందిన సత్యనారాయణ్ జతియా తన కుటుంబసభ్యులు, మనవడితో కలిసి పార్లమెంట్ కు వచ్చారు. విజిటింగ్ టైమ్ లో ప్రధానిని కలిశారు. ఆయన మనవడితో ప్రధాని కొద్దిసేపు సరదాగా గడిపారు.