ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మరీ ఎక్కువసేపు కదలకుండా కూర్చో వటం మాత్రం అస్సలే మంచిది కాదట. మనం పనిచేస్తున్నప్పుడైనా సరే గంటలకొద్దీ కదలకుండా కూచోవటం మన హెల్త్ ని పాడు చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని ఎల్‌‌.పి.ఎల్‌‌ పనితీరు తగ్గిపోతుంది. ఈ ఎల్‌‌.పి.ఎల్‌‌ వాక్యూమ్‌‌ క్లీనర్‌‌లా పనిచేస్తూ రక్తంలోని చెడు కొలస్ట్రాల్‌‌ను పీల్చుకుని కండరాల రూపంలోకి మారుస్తుంది. సో, కదలకుండా కూర్చున్నపుడు సిస్టం మొత్తం సైలెంట్ అయిపోతుంది.  దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, నడుము దగ్గరలో నిల్వ ఉండిపోతుంది. రోజు మొత్తం మీద ఒకేచోట మూడుగంటలకి మించి కూర్చోకూడదు. అదీ తప్పని సరైతే తప్ప. వీలున్నప్పుడు ప్రతీ అరగంటకి ఓసారి లేచి అటుఇటు కాసేపు తిరగటం మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పనిచేసే చోట ఆఫీసైనా, ఇంట్లో అయినా అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిలబడడం, నడవడం, పచార్లు కొట్టడం లాంటివి చేయాలి. ఆఫీస్‌‌లో మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ దగ్గరకు తెప్పించుకోకుండా వాటి దగ్గరకు మనమే లేచి వెళ్లడం మంచిది. ఆఫీసులో నలుగురితో లేదా పది మందితో మీటింగ్‌‌ ఉంటే కూర్చుని మాట్లాడకుండా నిలబడే మాట్లాడుకోవడం మంచిది. ఇంట్లో మంచాలపై, సో ఫాలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపైనే కూర్చోవాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి