వీడియో: చిన్నారి పేషంట్ కోసం దిగొచ్చిన బ్యాట్‌మన్

వీడియో: చిన్నారి పేషంట్ కోసం దిగొచ్చిన బ్యాట్‌మన్

డాక్టర్‌ను కనిపించే దేవుడితో పోలుస్తారు. ఎందుకంటే మనిషికి దేవుడి తర్వాత ప్రాణం పోయగల శక్తి డాక్టర్ ఒక్కడికే ఉంది. అంతేకాకుండా ఎంత పెద్ద రోగం వచ్చినా నయం చేసి నేనున్నానంటూ ధైర్యాన్ని నింపుతాడు. అలాంటి ఓ డాక్టర్ తన పేషంట్ కోసం బ్యాట్‌మన్‌గా మారాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ డకోటాలో జరిగింది. ఒక పిల్లవాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతనికి అవే చివరి రోజులు. ఆ విషయం పిల్లవాడికి తెలియదు. అయితే డాక్టర్ పిల్లవాడిని నీకు ఏదైనా కావాలని ఉందా అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు.. నాకు బ్యాట్‌మన్‌ను కలవాలని ఉంది అని చెప్పాడు.

పిల్లవాడి కోరిక విన్న డాక్టర్ మరుసటి రోజు బ్యాట్‌మన్‌‌లాగా తయారై ఆస్పత్రికి వచ్చాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు. దాంతో ఆ బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడియోను ఫీల్ గుడ్ పేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. పిల్లవాడి కోరిక తీర్చిన డాక్టర్ నిజంగా మరోసారి తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

For More News..

వీడియో: ఏనుగు కోసం తొలిసారిగా ప్రపంచంలోనే భారీ ఆర్టిఫిషియల్ లెగ్

15 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన పోలీస్ ఫుట్‌పాత్ మీద..

పండగపూట షోరూం దోచుకెళ్లిన దొంగలు

కరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి