ఫేక్ నోట్తో డాక్టర్కు షాకిచ్చిన పేషెంట్

ఫేక్ నోట్తో డాక్టర్కు షాకిచ్చిన పేషెంట్

ఈ మధ్య కాలంలో దొంగ నోట్ల చలామణి కూడా ఎక్కువయ్యాయి. కొంతమంది కావలనే దొంగ నోట్ల ఇచ్చి ప్రజలను మోసం చేస్తు్ండగా మరికొందరు మాత్రం తెలియకుండానే ఇచ్చి వెళ్లిపోతున్నారు. తాజాగా ఓ డాక్టర్ కు ఇలాంటి సంఘటనే ఎదురైంది.  ముంబయికి చెందిన మనన్‌ వోరా ఒక ఆర్థోపెడిక్‌ సర్జన్‌. ఇటీవల అతని దగ్గరికి ఓ పేషెంట్ వచ్చాడు.  

ఫీజు కింద రూ. 500  రిసెప్షనిస్ట్‌ వద్ద ఇచ్చి వెళ్లాడు. ఆ నోటును రిసెప్షనిస్ట్‌ కూడా గమనించలేదు. కాసేపటికి  మనన్‌ వోరా ఆ నోటును చూసి ఫేక్ నోటు అని గుర్తి్ంచారు. పేషెంట్ చేసిన పనికి  మనన్‌ వోరా సీరియస్ గా తీసుకోలేదు.  అది నకిలీ నోటని బహుశా ఆ పేషెంట్ కు కూడా తెలిసుండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.  

 ఫేక్ నోటును చూశాక తనకు నవ్వు ఆగలేదని తెలిపారు. ఈ నోటుని చాలా భద్రంగా  దాచుకున్నానన్నారు.   ఇంకో విషయం ఏంటంటే..ఆ నోటు వెనకాల ఫర్ ప్రాజెక్ట్‌ స్కూల్ యూజ్ ఓన్లీ అని రాసుందని తెలిపారు మనన్‌ వోరా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.