డాక్టర్ నిర్లక్ష్యం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

డాక్టర్ నిర్లక్ష్యం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

బతికుండగానే పాప చనిపోయిందంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటలోని డ్యూటీ డాక్టర్. సంగారెడ్డి జిల్లా చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన అర్చన గత నెల 7న సృహ తప్పి కిందపడింది. దీంతో ఆమెను జహీరాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చనను చూసిన డ్యూటీ డాక్టర్ ECG తీసి పాప చనిపోయినట్లు ఏకంగా డెడ్ అని చిట్టి రాసి బంధువుల చేతులో పెట్టాడు. బంధువుకు డౌట్ వచ్చి అర్చనను సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చన బతికేఉందని చెప్పిన డాక్టర్లు.. ట్రీట్మెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం అర్చన కోలుకుని హాస్పిటల్ నుంటి డిశ్చార్జ్ అయింది. అయితే బతికుండగానే చనిపోయిందని చెప్పినా డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బంధువులు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

కోల్కత్తాలో 10 నిమిషాల్లో లిక్కర్ డెలివరీ

పేరు మార్చుకున్న దేశం