ప్రియాంక రెడ్డి కేసు : బీరు సీసాలు, కీలక వస్తువులు స్వాధీనం

ప్రియాంక రెడ్డి కేసు : బీరు సీసాలు, కీలక వస్తువులు స్వాధీనం

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక కేసులో కీలక ఆధారాలు సంపాదించారు పోలీసులు. ఉదయం నుంచి పది బృందాలతో ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు.. తొండుపల్లి టో ల్ గేట్ దగ్గర కొన్ని కీలక ఆధారాలు సంపాదించారు. డాగ్ స్వ్కాడ్ ఆధారంతో.. టోల్ గేట్ సమీపంలో కొన్ని బీరు సీసాలు, ప్రియాంకకు సంబంధించిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దొరికి ఆధారాలను బట్టి.. టోల్ గేట్ సమీపంలోనే ప్రియాంకను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. టోల్ గేట్ దగ్గర హత్య చేసి.. డెడ్ బాడీని చాటాన్ పల్లి అండర్ పాస్ దగ్గర తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఇక సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు ప్రియాంక ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్లే విజువల్స్, అలాగే టోల్ గేట్ దగ్గర స్కూటీ పార్క్ చేసే దృశ్యాలను గుర్తించారు.