కంట్లో తేనెటీగలు : ప్రపంచంలో మొట్టమొదటి కేసు

కంట్లో తేనెటీగలు : ప్రపంచంలో మొట్టమొదటి కేసు

వైద్య చరిత్రలోనే ఇది ఓ డిఫరెంట్ కేస్. ఐనా… డాక్టర్లు ఆపరేషన్ లో సక్సెసయ్యారు. పేషెంట్ ను బాధ నుంచి విముక్తి కల్పించారు. ఈ సంఘటన తైవాన్ లో జరిగింది.

హే అనే 29 ఏళ్ల మహిళ తీవ్రమైన కంటినొప్పితో… వాపుతో తైవాన్ లోని ఫూయిన్ యూనివర్సిటీ హాస్పిటల్ కు వెళ్లింది. అక్కడి డాక్టర్, ఆఫ్తమాలజిస్ట్ హుంగ్ ఆమెను పరీక్షించాడు.  మైక్రోస్కోప్ లో కంటిని పరిశీలించి చూశాడు. ఆమె కంటి రెప్ప కింద.. నాలుగు తేనేటీగెలు… ప్రాణాలతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. వాటిని చూసి … ఆమె పరిస్థితి చూసి డాక్టర్ ఒక్కసారిగా షాకయ్యాడు. వాటితో ప్రమాదం లేదని… పేషెంట్ కు ధైర్యం చెప్పి.. ఆ నాలుగు తేనెటీగలను… కంటికి ఇబ్బంది కలగకుండా… వాటి శరీర భాగాలు కంటికి అతుక్కుపోకుండా జాగ్రత్తగా వేరు చేశాడు. ఆ తర్వాత తాము డీల్ చేసిన కేసును గురించి… ఇచ్చిన ట్రీట్ మెంట్ గురించి మీడియాకు వివరించారు.

ఇలాంటి చికిత్స తాము ఇంతవరకు చూడలేదని.. చేయలేదని హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. మైక్రో స్కోప్ లో చూస్తూ.. అత్యంత జాగ్రత్తగా వాటిని తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల తాను ఓ సమాధి దగ్గరకు వెళ్లి.. అక్కడ నీళ్లతో ముఖం కడుక్కున్నాననీ.. ఆ తర్వాత నుంచి కంటి నొప్పి మొదలైందని చెప్పింది బాధితురాలు. ముందు ఐ డ్రాప్స్ వేసుకున్నాననీ.. తగ్గక పోయేసరికి డాక్టర్లను సంప్రదించానని వివరించింది.