ఇష్టమొచ్చినట్లుగా  వర్కవుట్లు వద్దు !

V6 Velugu Posted on Apr 08, 2021

  •     లాక్ డౌన్ నుంచి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ 
  •     యాప్​లు ఫాలో అవుతూ డైట్లు
  •     సమ్మర్​లో ఇలా చేస్తే రిస్కంటున్న డాక్టర్లు, ఫిట్​నెస్​ ట్రైనర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనాతో  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. జిమ్​లకు వెళ్తున్నవారితో పాటు  ఇండ్లలోనే ఎక్సర్​సైజ్​లు చేస్తున్న వారు 50శాతానికి పైనే ఉన్నారు. మారిన లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఫిట్​గా ఉండాలనే  ఆలోచనతో గంటల తరబడి కేలరీలను కరిగించుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా తెచ్చిపెట్టుకున్న అలవాటుతో అనారోగ్యాల పాలవుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా వర్కవుట్లు చేస్తే బాడీ తీసుకోలేదని సూచిస్తున్నారు. సమ్మర్​లో  ఎక్కువగా వర్కవుట్లు చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్​ వస్తాయని అంటున్నారు. అవసరానికి మించి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు హెవీ ఎక్సర్ సైజ్ లు చేయకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు. 

 ఇష్టమొచ్చినట్టు చేసేవారే ఎక్కువ

ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉన్నవారికి వైరస్ త్వరగా సోకుందని తెలిశాక చాలామంది ఫిట్​నెస్​పై దృష్టి పెట్టారు. లాక్ డౌన్​లో జిమ్​లు, ఫిట్​నెస్ ​సెంటర్లు క్లోజ్ అయినా  ఆన్​లైన్​లో లైవ్ క్లాసులను వింటూ ఇంట్లోనే వర్కవుట్లు చేయడం మొదలుపెట్టారు. చాలామంది ఒబెసిటీ, కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతోనే జిమ్ లో జాయిన్ అయ్యారని ఫిట్​నెస్​ ట్రైనర్ వెంకట్ తెలిపారు. పర్సనల్ ట్రైనర్ హెల్ప్ తో ప్రాపర్ గా జిమ్ చేస్తున్న వారి కంటే ఇమ్మిడియట్ రిజల్ట్ కోసం ఇష్టమొచ్చినట్టు ఎక్సర్ సైజులు చేస్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో పాటు కొత్తగా వస్తున్న యాప్ లనూ ఫాలో అవుతున్నారు. మజిల్​ని బిల్డ్ చేయాలనుకునేవారు, బెల్లీ ఫ్యాట్, హెవీ వెయిట్ సమస్య ఉన్నవారు  డైట్,  ఎక్సర్ సైజ్ చేయాలని ఫిట్​నెస్​ట్రైనర్లు చెబుతున్నారు. 

అధిక బరువులు ఎత్తితే..

కండలను పెంచాలనుకునేవారు హెవీ వెయిట్స్ తో ఎక్కువగా ఎక్సర్ సైజ్​లు చేస్తుంటారు. కిలోలకు కిలోలున్న డంబెల్స్ తో వర్కవుట్స్ చేస్తుంటారు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తేనే మజిల్ పెరుగుతుందనేది అపోహ మాత్రమేనని ట్రైనర్లు అంటున్నారు.  శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ తగినట్టుగా ఇవ్వగలితే  కండరాలు పెరగడం, తగ్గడం అవుతుందంటున్నారు. అధికబరువు వల్ల   ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల  జాయింట్ పెయిన్స్ తదితర కండరాల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. 

20 నుంచి 25 నిమిషాలు చాలు

సమ్మర్​లో ఎక్సర్ సైజ్ చేసినా, చేయకపోయినా బాడీలో వాటర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ వల్ల బాడీ టెంపరేచర్ నార్మల్ గా ఉండదు.  20 నుంచి 25నిమిషాలు వర్కవుట్స్ చేసి డైట్ మెయింటెన్ చేస్తే సరిపోతుంది. హెవీ గా చేయడం వల్ల బాడీ డీ హైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది.  వాటర్ లాస్ వల్ల తలనొప్పి, నిద్రలేమి, చిరాకు, వాంతులు, కళ్లు తిరిగి కిందపడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే వర్కవుట్ తర్వాత ఎలక్ట్రో లైట్స్ ప్యాకెట్ ని 300, 350 ఎంఎల్ వాటర్ లో కలిపి తీసుకోవాలని ఫిట్​నెస్​ ట్రైనర్లు చెప్తున్నారు. 30 నుంచి 40 నిమిషాలు జాగింగ్, వాకింగ్ చేసేవాళ్లు ఎలక్ట్రో లైట్స్ ని వర్కవుట్స్​తర్వాత తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ 

ఎక్సర్​సైజ్​లు చేసేవాళ్లు..

రోజు ఒక వర్కవుట్​ని 10 నుంచి 12 సార్లు రిపీట్ చేస్తూ ఒక మూడు ఎక్సర్ సైజ్ లు చేసుకోవచ్చు.  ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు మూడు నుంచి 3.5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. బటర్ మిల్క్, గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు తాగాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. లేదంటే నీరసంగా అయిపోతారు. 
- వెంకట్, ఫిట్​నెస్ ట్రైనర్​

వర్కవుట్స్​అనుగుణంగా ఫుడ్​ 

ఉదయం, సాయంత్రం లైట్ వర్క్ అవుట్స్ చేస్తే బెటర్. హార్ట్, లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు హెవీ ఎక్సర్ సైజ్​లు కాకుండా బ్రీతింగ్, ట్రెడ్ మిల్, వాకింగ్ లాంటివి చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు అతిగా ఎక్సర్ సైజ్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.   అలవాటు లేని వారు ఒక్కసారిగా వర్కవుట్స్ చేసి బయటకు వెళితే ఎండదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. బాడీలో వాటర్ లెవల్స్ తగ్గిపోతాయి. 60 ఏండ్లు దాటిన వారు వీటికి దూరంగా ఉండాలి.  
- డాక్టర్ నవోదయ, ఫిజీషియన్ 

Tagged doctors, corona, Workouts, Side Effects, jym

Latest Videos

Subscribe Now

More News