పళ్లు సరిగా తోముకోకపోతే చాలారకాల ప్రాబ్లమ్స్‌

పళ్లు సరిగా తోముకోకపోతే చాలారకాల ప్రాబ్లమ్స్‌

పళ్లు సరిగా తోముకోకపోతే చాలారకాల ప్రాబ్లమ్స్‌ వస్తాయంటున్నారు డాక్టర్లు. నోటి దుర్వాసన, చిగుళ్లనుంచి రక్తం రావడం లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయట. అందుకే బ్రషింగ్‌లోని బేసిక్స్‌  ఫాలో అయితే.. ప్రాబ్లమ్స్‌ నుంచి దూరంగా ఉండొచ్చు.

ప్రతిరోజు కనీసం రెండుసార్లు బ్రష్‌ చేసుకోవాలి. హడావిడిగా కాకుండా నిదానంగా చేస్తే మంచిది. టూత్‌ పేస్ట్​లో ఫ్లోరైడ్‌ కంటెంట్‌ ఉంటే బెటర్‌‌. అది పళ్లు పుచ్చి పోనీయదు. ఎనామిల్‌ పోకుండా చేస్తుంది. పంటిని శుభ్రం చేసేందుకు బ్రష్‌ కూడా చాలా ఇంపార్టెంట్‌. మెత్తటి బ్రష్‌ వాడితే మంచిది. ఏడాదికి 3 – 4 బ్రష్‌లు మార్చాలి.  పిల్లల వయసుకు తగ్గట్లుగా బ్రష్‌ తీసుకోవాలి.  బ్రష్‌ చేశాక దాన్ని బాగా ఆరనివ్వాలి. దానివల్ల బ్రష్‌పై బ్యాక్టీరియా చేరదు.

తిన్నతర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్​ను కలవాలి. మౌత్‌ వాష్‌ వాడితే నోరు శుభ్రంగా ఉంటుంది. పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల పళ్లు రంగు మారతాయి. అందుకని, వాటిని  మానేస్తే  పళ్ల రంగు మారకుండా తెల్లగా ఉంటాయి.  పళ్లతో కూల్‌డ్రింక్‌ బాటిల్‌ మూతలు తీయడం, గట్టి పదార్థాలు కొరకడం లాంటివి చేయొద్దు. అలా చేస్తే పళ్లు తొందరగా విరిగిపోయే ఛాన్స్‌ ఉంటుంది.