సి-విటమిన్ ఎక్కువైనా ముప్పే

సి-విటమిన్ ఎక్కువైనా ముప్పే
ఇప్పుడు సి– విటమిన్ సీజన్ నడుస్తోంది. ఇమ్యూనిటీని పెంచుకోడానికి చాలామంది సి–– విటమిన్ వెంట పరుగులు పెడుతున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి వీటి వాడకం మరింత ఎక్కువైంది. అయితే, ఇమ్యూనిటీ బూస్టర్లను అవసరానికి మించి వాడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తి అవసరం. అందుకే ప్రతిఒక్కరూ బలమైన ఫుడ్ తీసుకోవాలంటూ’  కరోనా వచ్చినప్పటి నుంచి చెప్తున్నారంతా. కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి వాడకం పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ మోతాదుకి మించి సి– విటమిన్ తీసుకుంటున్నారు. మరికొంతమంది అవసరానికి మించి విటమిన్‌ సప్లిమెంట్లు వాడుతున్నారు. రోజులో ఎంత అవసరం ఎక్కువగా ఏది తిన్నా అనర్థాలు ఎక్కువ. మంచి ఫుడ్ కదా అని మోతాదుకి మించి తింటే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇష్టానుసారంగా సప్లిమెంట్స్ వేసుకున్నా కూడా డేంజరే. శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. సాధారణంగా 25 ఏళ్ళు దాటిన వాళ్లకు 65 నుంచి 90 మిల్లీ గ్రాముల సి– విటమిన్ అవసరం ఉంటుంది. ఒక కమలాపండులో 51 మిల్లీ గ్రాముల సి–విటమిన్ ఉంటుంది. దీనిబట్టి చూస్తే రోజుకు రెండు కమలాలు తింటే శరీరానికి రోజులో కావాల్సినంత  విటమిన్ సి అందుతుంది. ఇలా లెక్కకట్టి ప్రతిరోజూ సి– విటమిన్‌కు సంబంధించిన ఫుడ్ తినాలి. విటమిన్ ఎక్కువైతే దేనికైనా బ్యాలెన్సింగ్ అవసరం. అది తప్పితే నష్టం జరుగుతుంది. సి– విటమిన్ శరీరంలో ఎక్కువైతే  వికారం, వాంతులు, తలనొప్పి, విరేచనాలు, గుండెల్లో లేదా కడుపులో మంట, నిద్రలేకపోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సి–విటమిన్‌కు సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తింటున్నా, సప్లిమెంట్స్ ఎక్కువగా వేసుకుంటున్నా ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే మోతాదును తగ్గించాలి. లక్షణాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌‌ని కలిసి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. తింటేనే మేలు సి విటమిన్‌తో శరీరం హెల్దీగా, ఫిట్‌గా ఉంటుంది. అందుకే శరీరానికి ఇది అవసరం. కానీ, వీటిని సప్లిమెంట్స్ రూపంలో కన్నా  ఫుడ్ రూపంలో తీసుకోవడం మంచిది. పైగా పండ్లు, కూరగాయల్లో సి-విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు వీటినే తినాలి. పిల్లలకు చాలా తక్కువ ఇవ్వాలి శరీరానికి పుష్కలమైన ఐరన్ అందించడంలో సి– విటమిన్ కీ రోల్ పోషిస్తుంది. ఇది ప్రమాదకరమైన జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది.అయితే, ఇది మోతాదుకి మించి శరీరంలో ఉంటే తలతిరుగుడు, వికారం వంటి సమస్యలు వస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. అలాగే దీని మోతాదు పిల్లల్లో ఒకలా, పెద్దల్లో ఒకలా ఉంటుంది. పిల్లలకు చాలా తక్కువ మోతాదులో దీన్ని అందించాలి. పెద్దవాళ్లు 90 మిల్లీ గ్రాములు దాటకుండా చూసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప సప్లిమెంట్ల జోలికి పోకూడదు. ఒకవేళ వేసుకోవాల్సి వచ్చినా డాక్టర్‌‌ సలహాతో వేసుకోవాలి. డా. హరిచరణ్, జనరల్  ఫిజిషియన్, కేర్ హాస్పిటల్స్,  హైదరాబాద్