Good Health : చిరాకుగా ఉందా.. ఏ విటమిన్ తీసుకుంటే ఎలాంటి హుషారు వస్తుంది..!

Good Health : చిరాకుగా ఉందా.. ఏ విటమిన్ తీసుకుంటే ఎలాంటి హుషారు వస్తుంది..!

మూడ్ బాగుంటేనే స్నేహ బంధాలు, 'వర్క్ రిలేషన్స్ బాగుంటాయి. అయితే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి లాంటివి. దూరం కావాలంటే విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారంతో పాటు ట్యాబెట్లు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

ఒమెగా-3ఎస్

మనిషి మెదడును ప్రభావితం చేయడంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పని చేస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఒమెగా -3 ఎస్ సంప్లిమెంట్స్ అందిస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది. చేపల్లో ఒమెగా-3 ఎస్ పుష్కలం. అయితే, చేపలు, తినని వాళ్లు చేప నూనె వాడొచ్చు. చేపలతో పాటు బాదం, పిస్తా, వాల్నట్స్, చియా, దోస గింజల్లో ఒమెగా-3 ఎస్ సప్లిమెంట్స్ లభిస్తాయి. 

విటమిన్ బి3

దీన్నే 'నియాసిస్' అని కూడా అంటారు. ఇది సెరటోనిన్ ఉత్పత్తిపై ప్రభావితం చూపుతుంది. సెరటోనిన్ రక్తకణాలు, సీరంలో ఉంటుంది. దీనివల్లే మెదడు నుంచి వచ్చే సంకేతాలు శరీరంలోని నాడీ వ్యవస్థకు చేరతాయి. ఇది లోపిస్తే డిప్రెషన్ కు గురవుతారు. మెదడు చురుకుదనం తగ్గుతుంది. అయితే, డిప్రెషన్ తీవ్రతను బట్టి 'విటమిన్ బి3' ప్రతి రోజు కనీసం 20 ఎంజీ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

విటమిన్ బి6

శారీరక, మానసిక పనితీరు మీద ప్రభావం చూపడంలో 'విటమిన్ బి6' కీలకంగా పని చేస్తుంది. మహిళల్లో రుతుక్రమాన్ని బ్యాలెన్స్ చేయడంలోనూ తోడ్పడుతుంది. పిల్లలు పుట్టకుండా మాత్రలు వాడే వాళ్లలో 'బి' విటమిన్' తీవ్రంగా లోపిస్తుంది. ముఖ్యంగా 'బి 6' స్థాయిలు బాగా పడిపోతాయి. కాబట్టి ఆ సమయంలో 'బి6' సప్లిమెంట్స్ బాగా అవసరం. ట్యాబెట్ల రూపంలో వీటిని నిత్యం 25 ఎంజీ చొప్పున తీసుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. 

విటమిన్ బి12

మెదడు పనితీరు, చురుకుదనాన్ని పెంచడంలో "విటమిన్ బి12" బాగా ఉపయోగపడుతుంది.దీన్ని సమృద్ధిగా తీసుకున్నవాళ్లకు డిప్రెషన్ సమస్య ఉండదు. "బి 12" లోపం ఉన్నవాళ్లు ప్రతిరోజు 10 ఎంజీ చొప్పున 'బి కాంప్లెక్స్' ట్యాబెట్లు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. బి12 విటమిన్ ను భర్తీ చేయాలంటే లివర్, చేప పిల్లలు, గొర్రె మాంసం, గుడ్లు, వెన్న తీసుకోవాలి. 

విటమిన్ సి

పెద్దవాళ్ల మెదడు పనితీరు మీద 'విటమిన్-సి' బలంగా పని చేస్తుంది. ఇది లోపిస్తే డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలొస్తాయి. ఇది నీళ్లలో కరిగే విటమిన్ కాబట్టి శరీరంలో నిల్వ ఉండదు. కాబట్టి ప్రతిరోజూ 'విటమిన్-సి తీసుకోవాలి. 100 ఎంజీ నుంచి 2000 ఎంజీ వరకు తీసుకోవచ్చు. అయితే, మోతాదు మించితే డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్-సి ముఖ్యంగా నిమ్మజాతి పండ్లలో పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ డి

మనిషి మెదడు మీద ప్రభావం చూపడంలో 'డి'విటమిన్ చాలా కీలకం. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపుతూ.. ఖరీదైన ఫుడ్ తీసుకుంటున్న చాలా మంది విటమిన్ 'డి'ని మర్చిపోతున్నారు. సూర్యకాంతిని సక్రమంగా వినియోగించుకోలేక చాలా మంది డిప్రెషన్కు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం. అమెరికాలోని 75 శాతం మంది ప్రజలు 'విటమిన్ 'డి' లోపంతో బాధపడుతున్నారు. మన దేశంలోనూ చాలా మంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్లలో పెద్దలతో పాటు యువత కూడా ఉంది. శరీరం మీద పడే సూర్యకాంతిని మెదడు గ్రహించి.. జ్ఞాపకశక్తి, మేధాశక్తి, చురుకుదనం లాంటి లక్షణాలను మెరుగుపరుచుకుంటుంది. అంతేకాదు.. 'విటమిన్-డి' ఎముకలు, దంతాల పటిష్టతకు మేలు చేస్తుంది. 'డి-విటమిన్' కోసం ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతి తగిలేలా చూసుకుంటే చాలు.

ఫోలిక్ యాసిడ్

ఫోలేట్ దీన్నే 'ఫోలిక్ యాసిడ్' లేదా 'విటమిన్ బి-9' అని పిలుస్తారు. శరీరంలో కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావడానికి ఇది తోడ్పడుతుంది. గర్భిణులు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వాలన్నా కాన్పు సజావుగా జరగాలన్నా "విటమిన్ బి-9" సమృద్ధిగా ఉండాలి. ఫోలిక్ యాసిడ్...న్యూరో ట్రాన్స్ మీటర్గా పనిచేసే సెరటోనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంతో పాటు మంచి మూడ్ని నియంత్రణలో ఉంచుతుంది. డాక్టర్ల సూచన మేరకు ప్రతి రోజు 400 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చు.

మెగ్నీషియం

మెదడు రిలాక్స్ కావడానికి మెగ్నీషియం చాలా అవసరం. అలాగే కండరాలు బిగుసుకుపోవడం, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ముడి ధాన్యం, ఎండబెట్టిన బీన్స్, నట్స్, ముదురు ఆకు పచ్చ గింజ ధాన్యాల్లో ఇది పుష్కలంగా దొరుకుతుంది. తక్షణ ఫలితానికి 320 నుంచి 450 ఎంజీ చొప్పున మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఐరన్

ఐరన్ లోపిస్తే మనిషి శరీరం నిర్వీర్యం అవుతుంది. తీవ్రమైన అలసటగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. రుతుక్రమం వల్ల మహిళలకు ఐరన్ అవసరం. శరీరంలో సరిపడినంత ఐరన్ ఉంటే మలబద్దకం సమస్య ఉండదు. ఇది లివర్, పాలకూర, పాలు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, సోయాబీన్స్ పుష్కలం.

క్రోమియం 

మనిషికి ఇది తక్కువ మోతాదులోనే అవసరం. అయినప్పటికీ.. దీని లోపం కారణంగా బాధపడేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. రక్తంలోని షుగర్ లెవెల్స్ ని సమతుల్యంగా ఉంచడం ద్వారా మూడ్నో ప్రభావితం చేస్తుంది. సెరటోనిన్, మెలటోనిన్ లాంటి బ్రెయిన్ కెమికల్స్ ఉత్పత్తికి క్రోమియం దోహదపడుతుంది. మాంసం, అలుగడ్డలో ఇది ఎక్కువగా లభిస్తుంది. 

ఎల్-థియానిన్

శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి పెరగడానికి, మెదడులో ఆల్బావేవ్స్ పెరుగుదలకు కారణమైన అమైనో యాసిడ్స్. గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. నరాలను ఉత్తేజపరిచే ఆర్గానిక్ కాంపౌండ్స్లో నే 'ఎలియానిన్'గా పిలుస్తారు. కాబట్టి ప్రతిరోజూ గ్రీన్ టీ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధి చెంది.. మెదడు చురుగ్గా ఉంటుంది.